ఆదివారం 07 మార్చి 2021
National - Nov 25, 2020 , 07:28:37

కాంగ్రెస్‌ బలోపేతానికి ఆయన కృషి చిరస్మరణీయం: ప్రధాని మోదీ

కాంగ్రెస్‌ బలోపేతానికి ఆయన కృషి చిరస్మరణీయం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా సేవలో తన జీవితాన్ని గడిపారని ట్వీట్‌ చేశారు. ‘అహ్మద్‌ పటేల్‌ గారి అకాల మరణం తనను చాలా బాధకు గురిచేసింది. ఆయన చాలాకాలంపాటు ప్రజా జీవితంలో ఉన్నారు. సమాజానికి సేవ చేశారు. పదునైన వ్యూహకర్తగా, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అహ్మద్‌ పటేల్‌ కుమారుడు ఫైజల్‌తో మాట్లాడాను. తనకు సానుభూతి తెలిపాను. ఆయన ఆత్మకకు శాంతి చేకూరాలి’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.   

VIDEOS

logo