Ashleigh Gardner | నెచ్చెలితో నిశ్చితార్థం.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మనసుపడింది ఈమెపైనే
Ashleigh Gardner : ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆల్‌రౌండర్ అషే గార్డ్నర్(Ashleigh Gardner) కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న మోనికా రైట్(Monica Wright)తో బంధాన్ని మరో మెట్టు ఎక్కించింది. శుక్రవారం గార్డ్నర్ తన నెచ్చెలి మోనికాతో ఎంగేజ్మెంట్ చేసుకుంది.
Ashleigh Gardner : ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆల్‌రౌండర్ అషే గార్డ్నర్(Ashleigh Gardner) కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న మోనికా రైట్(Monica Wright)తో బంధాన్ని మరో మెట్టు ఎక్కించింది. శుక్రవారం గార్డ్నర్ తన నెచ్చెలి మోనికాతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇద్దరూ ఉంగరాలు మార్చుకొని మురిసిపోయారు. తమ నిశ్చితార్థ ఫొటోలను గార్డ్నర్ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. ఆ ఫొటోలు చూసినవాళ్లంతా కాబోయే కొత్త జంటకు అభినందనలు తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.
గార్డ్నర్, మోనికాలు 2021 నుంచి ప్రేమలో ఉన్నారు. అప్పటికే గార్డ్నర్కు తొలి గర్ల్‌ఫ్రెండ్ బ్రిడ్జెట్ ప్యాటెర్సన్(Bridget Patterson)తో బ్రేకప్ అయింది. ఆ తర్వాత ఆమె మోనికాతో చనువు పెంచుకుంది. గత మూడేండ్ల నుంచి వీళ్లు తరచూ తమ సన్నిహిత ఫొటోలను ఆన్లైన్లో పెడుతున్నారు. ఈ మధ్యే ‘క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్’ వేడుకలోనూ ఈ ఇద్దరూ తళుక్కుమన్నారు. నిరుడు అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణించిన గార్డ్నర్ ‘బెలిండా’ అవార్డు గెలుచుకుంది.
గుజరాత్ జెయింట్స్‌కు..
మహిళల ప్రీమియర్ లీగ్‌లో సైతం గార్డ్నర్ మెరిసింది. గుజరాత్ జెయింట్స్ తరఫున తన మార్క్ ఆటతో అదరగొట్టింది. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో సంచనల ప్రదర్శనతో పలు అవార్డులు కొల్లగొట్టింది. రికార్డు స్థాయిలో ఏకంగా నాలుగుసార్లు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్'(Player Of The Month) అవార్డును గార్డ్నర్ ఎగరేసుకుపోయింది.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

