IndiGo | విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ (Emergency Door) తెరిచేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఇండిగో 6ఈ6341 విమానం నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరింది ( Delhi-Chennai IndiGo flight). అయితే విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికి అందులోని ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు. ఈ ఘటనలో తోటి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని సదరు ప్రయాణికుడిని అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, డోర్ తెరిచేందుకు యత్నించిన వ్యక్తిని మణికందన్‌గా గుర్తించారు. విమానం చెన్నైలో ల్యాండ్ అయిన వెంటనే అతడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులకు అప్పగించారు. ఇండిగో అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read..
Santana Dharma: అస్పృశ్యత పోవాలంటే సనాతనం పోవాల్సిందే: ఉదయనిధి స్టాలిన్
Sonia Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడనున్న సోనియా గాంధీ
Diabetes | డయాబెటిస్ వస్తే పురుషుల కంటే మహిళలకే ఈ రిస్క్‌లు ఎక్కువ!