న్యూఢిల్లీ: తమిళనాడులో సామాజిక వివక్ష చాలా ఎక్కువ స్థాయిలో ఉందని ఆ రాష్ట్రానికి చెందిన గవర్నర్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, తమిళనాడులో సామాజిక వివక్ష ఎక్కువగా ఉన్నట్లు ఆయన ఆరోపించారు. ఆ అంశంపై రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. అస్పృశ్యతను రూపుమాపాలంటే.. ముందుగా సనాతన ధర్మాన్ని(Santana Dharma) నిర్మూలించాల్సి ఉంటుందని స్టాలిన్ పేర్కొన్నారు.
ఒకవేళ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తే, అప్పుడు అస్పృశ్యత కూడా నాశనం అవుతుందని భావిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. ఇటీవల సనాతన ధర్మంపై స్టాలిన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారాయన. ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.