Diabetes | డయాబెటిస్ వస్తే పురుషుల కంటే మహిళలకే ఈ రిస్క్‌లు ఎక్కువ!
Diabetes | డయాబెటిస్ జీవనశైలి రుగ్మత. మహిళల్లో డయాబెటిస్తో ఉత్పన్నమయ్యే జబ్బుల్లో గుండె సమస్యలు, ఎముకల నొప్పి ప్రధానమైనవి. మధుమేహం ఉన్నవాళ్లు ఈ రెండు గండాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
Diabetes | డయాబెటిస్ జీవనశైలి రుగ్మత. మహిళల్లో డయాబెటిస్తో ఉత్పన్నమయ్యే జబ్బుల్లో గుండె సమస్యలు, ఎముకల నొప్పి ప్రధానమైనవి. మధుమేహం ఉన్నవాళ్లు ఈ రెండు గండాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
మధుమేహం.. గుండె జబ్బు, గుండెపోటు ముప్పును రెండు రెట్లు పెంచుతుంది. ఇతరులతో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవారికి చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికం. ఎంత ఎక్కువ కాలం డయాబెటిస్ ఉంటే గుండె జబ్బుల ముప్పు అంత ఎక్కువ. అయితే, కొన్ని జీవనశైలి మార్పులతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. మధుమేహాన్నీ అదుపులో ఉంచుకోవచ్చు.
అందులోనూ టైప్ వన్ డయాబెటిస్ రోగుల్లో ఎముకల బలహీనత అతి సాధారణ సమస్య. వీరిలో ఎముకలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్లు, రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోనివాళ్లకు ఎముకల పగుళ్ల ముప్పు మరింత అధికం. జీవితం తొలినాళ్లలోనే.. ఎముకలు బరువు పెరుగుతున్న దశలో టైప్-1 డయాబెటిస్ తలెత్తుతుంది. దీంతో ఎముకలు పూర్తి బరువును, బలాన్ని సంతరించుకున్నా.. టైప్- 1 డయాబెటిస్ రోగుల్లో వాటి సాంద్రత క్షీణించే ఆస్కారం అధికం. తర్వాత కాలంలో ఎముకలు గుల్లబారే ఆస్టియోపొరోసిస్ బారిన పడొచ్చు.
నరాలు ధ్వంసం కావడం, కండరాల బలహీనత, దృష్టి సమస్యలకు తోడు.. ఎముకల పగుళ్లు, క్షీణత మొదలైన ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి, మహిళలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయులు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుకోవాలి. కొంతమందికి తమకు డయాబెటిస్ ఉన్నట్టు కూడా తెలియదు. దీంతో సమస్య మరింత తీవ్రం అవుతుంది. అందువల్ల, రక్తంలో చక్కెర స్థాయి, శరీర బరువు, కొవ్వు శాతం మొదలైనవాటి వివరాలను వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా తెలుసుకుంటూ ఉండాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

