జైపూర్: దేశ విభజన హృదయవిదారకరమైందని, దాని గురించి పిల్లలకు చెప్పాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కావొద్దు అని సుధా మూర్తి(Sudha Murty) అన్నారు. ద మ్యాజిక్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ రింగ్స్ పుస్తకాన్ని ఆమె తాజాగా రాశారు. ఆ బుక్లో దేశ విభజన గురించి ఆమె లోతుగా విశ్లేషించారు. జైపూర్లో జరుగుతున్న సాహిత్య సంబరాల్లో పాల్గొని ఆమె మాట్లాడారు. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ కుమార్తె, సుధా మూర్తి మనువరాలు అయిన అనౌషకా సునాక్ ఆ బుక్లో ప్రధాన క్యారెక్టర్.
అయితే చరిత్ర తెలియని వ్యక్తులు ఓ గీతగీసి అందరి తలరాతలను మార్చినట్లు సుధామూర్తి తన కొత్త బుక్లో పేర్కొన్నారు. మీకు చరిత్ర తెలియకుంటే, అప్పుడు మీకు భవిష్యత్తు అర్థం కాదు అని, దేశవిభజన గురించి ఆలోచిస్తే, పిల్లలకు దీని గురించి చెప్పాలనిపించిందని, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని, మళ్లీ ఇలాంటివి రిపీట్ కావొద్దు అన్నారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి ప్రజలు వలస వెళ్లిన తీరు పట్ల చాలా విచారం వ్యక్తం చేయాల్సి వస్తుందన్నారు. రిషి సునాక్ పేరెంట్స్ పాక్లో ఉండేవారని, అయితే విభజన సమయంలో నైరోబీకి వెళ్లారని, అక్కడ సమస్య రావడంతో మళ్లీ లండన్ వెళ్లినట్లు సుధామూర్తి తెలిపారు.
When Nooni stumbles upon a pair of old earrings, she unravels a tale of lost treasures, hidden histories, and family secrets. With ‘The Magic of the Lost Earrings,’ Sudha Murty, beloved author and master storyteller, weaves a deceptively simple tale that carries within it the… pic.twitter.com/myTiiuEl8Q
— jaipurlitfest (@JaipurLitFest) January 17, 2026