న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశవ్యాప్తంగా 18 రాజకీయ పార్టీలు 2015-2020 మధ్య రూ.6,500 కోట్లకు పైబడి ఖర్చు చేశాయి. వీటిలో 7 జాతీయ పార్టీలు, 11 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ మొత్తంలో సగం ప్రచారం కోసం చేసిన ఖర్చే. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు ఆయా పార్టీలు వార్షిక ఆడిట్ నివేదికలు సమర్పించాయి. ఎన్నికల ఖర్చులో పలు దక్షిణాది రాజకీయ పార్టీలు అగ్రభాగాన ఉన్నాయి. డీఎంకే, అన్నా డీఎంకే (తమిళనాడు), వైసీపీ (ఏపీ), జేడీఎస్ (కర్ణాటక) సగటు వార్షిక ఎన్నికల ఖర్చు అత్యధికంగా ఉంది. కాగా, 2019-20లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 14 ప్రాంతీయ పార్టీలకు రూ.447.49 కోట్ల విరాళాలు అందాయి. ఆ పార్టీల ఆదాయంలో ఇది 50.97 శాతం. ఈ వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ (ఏడీఆర్) తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 42 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.877.957 కోట్లు అని పేర్కొంది.
2015-20 మధ్య ప్రాంతీయ పార్టీల సగటు వార్షిక ఎన్నికల ఖర్చు (రూ.కోట్లలో)
డీఎంకే 40.25
వైసీపీ 28.46
బీఎస్పీ 26.82
శివసేన 20.95
అన్నాడీఎంకే 17.07
జేడీఎస్ 10.66
ఆప్ 9.16
టీఆర్ఎస్ 7.61
ఎస్ఏడీ 4.49