న్యూఢిల్లీ: పార్లమెంట్ భద్రత ఉల్లంఘన కేసులో మనోరంజన్ను ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై జరిపిన నార్కో పరీక్షలకు సంబంధించి మరిన్ని నివేదికలు రావాల్సి ఉందని, మరికొంత మందిని దర్యాప్తు అధికారులు ప్రశ్నించాల్సి ఉందని పోలీస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. సాగర్, మనోరంజన్పై అదనంగా నార్కో టెస్టులు, బ్రెయిన్ మ్యాపింగ్ జరిపామని పోలీసులు పేర్కొన్నారు.