చండీగఢ్: యూనివర్సిటీలో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్‌లో విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో ఒక విద్యార్థి మరణించాడు. మరో నలుగురు గాయపడ్డారు. (Panjab University Stabbing) దీంతో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొన్నది. చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్శిటీలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి ఆ వర్శిటీలో మాసూమ్ శర్మ సంగీత కార్యక్రమం జరిగింది. విద్యార్థులతోపాటు బయట వ్యక్తులు వేలాదిగా హాజరయ్యారు.
కాగా, మ్యూజిక్ కాన్సర్ట్ సందర్భంగా రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో ఒక విద్యార్థి మరణించగా నలుగురు గాయపడ్డారు. మృతుడ్ని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆదిత్య ఠాకూర్‌గా గుర్తించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో విద్యార్థులు నిరసనకు దిగారు. పోలీసులు తగినంత భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు.