Mumbai Airport | బ్యాగ్‌లో బాంబు ఉందంటూ.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మహిళ హల్చల్
Mumbai Airport | ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Mumbai Airport ) ఓ మహిళ హల్చల్ చేసింది. తన లగేజీ బ్యాగ్ (luggage)లో బాంబు ఉందంటూ ఎయిర్పోర్ట్ అధికారులను భయబ్రాంతులకు గురిచేసింది.
Mumbai Airport | ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Mumbai Airport ) ఓ మహిళ హల్చల్ చేసింది. తన లగేజీ బ్యాగ్ (luggage)లో బాంబు ఉందంటూ ఎయిర్పోర్ట్ అధికారులను భయబ్రాంతులకు గురిచేసింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ మహిళ ముంబై నుంచి కోల్‌కతాకు వెళ్తోంది. ఆమె రెండు బ్యాగులతో విమానాశ్రయానికి వచ్చింది. అయితే, నిబంధనల ప్రకారం.. పరిమితికి మించి బ్యాగ్‌లో లగేజీ ఉండటంతో మరో బ్యాగ్‌కు అదనపు ఛార్జీలు చెల్లించాలని ఎయిర్పోర్ట్ సిబ్బంది చెకింగ్ వద్ద ఆమెను కోరారు. అందుకు ఆమె నిరాకరించింది. అంతటితో ఆగకుండా తన లగేజీలో బాంబు (bomb) ఉంది అంటూ అధికారులను భయాందోళనకు గురి చేసింది.
దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది.. ఆమె బ్యాగ్‌ను స్కాన్ చేయగా ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదు. అనంతరం సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సహార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టైన కొద్దిసేపటికే ఆ మహిళను బెయిల్‌పై విడుదల చేశారు.
Also Read..
Dream Dog House | పెంపుడు కుక్క కోసం రూ.16 లక్షల ఇల్లు.. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన యజమాని
Snake Bite| పాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్న బాలిక.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bomb
- luggage
- Mumbai
- Mumbai Airport
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

