న్యూఢిల్లీ : భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఓ పాకిస్థాన్ రేంజర్ భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు విఫలయత్నం చేశాడు. అయితే అప్రమత్తంగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అతనిని అదుపులోకి తీసుకుంది.
నియంత్రణ రేఖ వెంబడి రాజస్థాన్లోని శ్రీ గంగా నగర్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. అతనిని బీఎస్ఎఫ్, నిఘా అధికారులు ప్రశ్నిస్తున్నా రు. చొరబడటానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నా రు. భారత సైన్యం కదలికలు, వ్యూహాలను తెలుసుకునేందుకు వచ్చాడా? అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.