న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) గురించి రక్షణ శాఖ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించింది. పాకిస్థాన్ చర్యల వల్లే సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయని విదేశాంగ కార్యదర్శి మిశ్రి తెలిపారు. పాకిస్థాన్ చర్యలకు తగిన రీతిలో భారత్ స్పందిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాకిస్థాన్‌కు బలమైన సమాధానం ఇస్తున్నట్లు కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. శ్రీనగర్, అవంతిపుర, ఉదంపూర్‌లో ఉన్న వైద్య కేంద్రాలపై పాకిస్థాన్ దాడి చేసినట్లు ఆమె తెలిపారు. పంజాబ్‌పై హైస్పీడ్ మిస్సైల్‌ను పాకిస్థాన్ ప్రయోగించినట్లు కల్నల్ సోఫియా వెల్లడించారు. పాకిస్తాన్ తమ సైనిక బలగాలను బోర్డర్ దిశగా కదిలిస్తోందని ఆమె పేర్కొన్నారు. పశ్చిమ బోర్డర్లో ఉన్న భారతీయ సైనిక కేంద్రాలపై డ్రోన్లు, లాంగ్ రేంజ్ వెపన్స్, అమ్యునిషన్స్, జెట్స్‌ను పాక్ వినియోగిస్తోందని ఖురేషీ చెప్పారు.
I have said on numerous occasions earlier, it is Pakistani actions that have constituted provocation and escalation. In response, India has defended and reacted in a responsible and measured fashion to these provocations and these escalations by the Pakistani side
– Foreign… pic.twitter.com/pyxyDtXi0g
— PIB India (@PIB_India) May 10, 2025
తెల్లవారుజామున 1.40 నిమిషాల సమయంలో పంజాబ్ ఎయిర్ బేస్‌పై పాక్ దాడి చేసిందని, ఆ దాడి కోసం హై స్పీడ్ మిస్సైళ్లను పాక్ వాడినట్లు సోఫియా పేర్కొన్నారు. వైమానిక క్షేత్రాలు, ఆర్మీ బేస్‌ల ధ్వంసానికి చెందిన టైం స్టాంప్ పిక్స్‌ను ఇండియన్ మిలిటరీ షేర్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కీలక స్థావరాలు డ్యామేజ్ అయినట్లు పాక్ చేస్తున్నట్లు ఆరోపణలు నిజం కాదు అని ఆమె వెల్లడించారు. పాకిస్థాన్ కవ్వింపులకు బదులుగా ఆ దేశ మిలిటరీ క్షేత్రాలను మాత్రమే టార్గెట్ చేసి.. ఇండియన్ ఆర్మీ అటాక్ చేసినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. పాకిస్థాన్ దుష్ ప్రచారం చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఎస్-400 ధ్వంసమైనట్లు వస్తున్న వార్తలు నిజంకాదన్నారు.
పాకిస్థాన్ లోని రహిమ్ యార్ ఖాన్‌లో ఉన్న సైనిక ఆస్తులను టార్గెట్ చేసినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. భారతీయ సైనిక బలగాలు నిత్యం సంసిద్ధతతో ఉన్నామని, అన్ని దాడులకు ధీటైన జవాబు ఇస్తున్నామని వ్యోమిక చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారతీయ సైనిక బలగాలు కట్టుబడి ఉన్నాయన్నారు. రాజౌరీపై జరిగిన కాల్పుల్లో ఓ అధికారి మృతిచెందినట్లు విక్రమ్ మిశ్రీ తెలిపారు.