న్యూఢిల్లీ: పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వ అప్పులు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. ఏప్రిల్ నెలలోనే రూ.1.4 ట్రిలియన్ల మేర పెరగడంతో మొత్తం కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.81.93 ట్రిలియన్లకు చేరాయని ‘బిజినెస్ రికార్డర్’ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ పనులకు అప్పుల మీదనే ఆధారప డటమే ప్రధాన కారణం.
పది నెలల్లోనే అప్పులు రూ.4 ట్రిలియన్లకు పైగా పెరిగాయి. ఇందులో దేశీయ అప్పులు రూ.3.6 ట్రిలియన్లకు పైగా ఉంటే, విదేశీ అప్పులు రూ.400 బిలియన్లుగా ఉన్నాయి.