చండీగఢ్: పంజాబ్‌లోని లూధియానా జిల్లా కోర్టులో జరిగిన బాంబు పేలుడు వెనుక పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థల హస్తం ఉండొచ్చని ఆ రాష్ట్ర డీజీపీ సిదార్థ్ చటోపాధ్యాయ చెప్పారు. ఈ పేలుడు కుట్ర, ప్రణాళిక అంతా పాక్ నుంచే జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ మేరకు ఆధారాలు లభించాయన్నారు. ఈ పేలుడులో మరణించిన మాజీ హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్‌కు ఖలిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్నారు.