న్యూఢిల్లీ: ట్విట్టర్ మాదిరిగా మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ కూడా త్వరలో బ్లూటిక్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ పెయిడ్ వెరిఫికేషన్ సర్వీసుపై ఇన్స్టాగ్రామ్ పనిచేస్తున్నదని డెవలపర్ అండ్ రివర్స్ ఇంజినీర్, లీకర్ అలెశాండ్రో పలుజ్జీ తెలిపారు. రాబోవు ఫీచర్‌కు సంబంధించిన కోడింగ్ సమాచారాన్ని గుర్తించినట్టు తన ట్విట్టర్ అకౌంట్లో రాసుకొచ్చారు. అయితే స్క్రీన్‌షాట్ పోస్ట్ చేసేవరకు దీనిని సమాచారంగా మాత్రమే పరిగణించాలని ఆయన కోరారు.