Navjot Singh Sidhu | క్యాన్సర్ నుంచి భార్య కోలుకోవడంపై సిద్ధూ వాదనలు.. నవజోత్ కౌర్‌కు 850 కోట్ల లీగల్ నోటీసు
Navjot Singh Sidhu | క్యాన్సర్ బారిన పడి చివరి దశలో ఉన్న తన భార్య ఆయుర్వేద పద్ధతులు, ఆ ఆహారం ద్వారా దాని నుంచి కోలుకున్నదని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల వాదించారు. ఈ నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్‌కు 850 కోట్ల మేర లీగల్ నోటీసు అందింది.
చండీగఢ్: క్యాన్సర్ బారిన పడి చివరి దశలో ఉన్న తన భార్య ఆయుర్వేద పద్ధతులు, ఆ ఆహారం ద్వారా దాని నుంచి కోలుకున్నదని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) ఇటీవల వాదించారు. నవంబర్ 21 న బహిరంగ మీడియా సమావేశం ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్‌కు 850 కోట్ల మేర లీగల్ నోటీసు అందింది. ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ (సీసీఎస్) ఈ నోటీసు జారీ చేసింది. ఆమె క్యాన్సర్ రికవరీ డైట్ గురించి సిద్ధూ చేసిన వాదనలపై వివరణ కోరింది.
కాగా, ఈ సందర్భంగా నవజ్యోత్ కౌర్‌కు సీసీఎస్ కొన్ని ప్రశ్నలు సంధించింది. మీ ఆరోగ్యం, క్యాన్సర్ నుంచి కోలుకోవడం గురించి మీ భర్త (సిద్ధూ) వాదనలకు మీరు మద్దతు ఇస్తున్నారా? మీ చికిత్స కోసం మీరు తీసుకున్న అల్లోపతి మందులు ప్రభావం చూపలేదని మీరు నమ్ముతున్నారా? మీరు కోలుకోవడానికి వేప ఆకులు, నిమ్మరసం, తులసి, పసుపు వంటి ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారా? లేదా మీరు అల్లోపతి మందులను కూడా వాడారా? అని ప్రశ్నించింది.
మరోవైపు క్యాన్సర్ రోగులు చికిత్సను వదిలేసేలా, మధ్యలోనే మందులు మానివేసేలా సిద్ధూ వాదనలు ప్రభావితం చేస్తున్నాయని ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ (సీసీఎస్) ఆరోపించింది. క్యాన్సర్ రోగుల జీవితానికి ఇది ప్రమాదం పెంచిందని విమర్శించింది. ఈ నేపథ్యంలో సిద్ధూ వాదనలకు మద్దతు ఇచ్చే సాక్ష్యాలను ఏడు రోజుల్లోగా సమర్పించాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. లేని పక్షంలో ప్రజలను ‘తప్పుదోవ పట్టించే’ వాదనలకు పరిహారంగా రూ.850 కోట్లు చెల్లించాలని సిద్ధూ భార్య కౌర్‌ను ఆ నోటీస్ ద్వారా కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

