India Corona | వార్నింగ్ బెల్స్.. ఒక్కరోజులో 7 వేలకు పైనే కొత్త కేసులు
India Corona | భారత్‌లో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజూవారీ పాజిటివ్ కేసుల్లో (Positive Cases) భారీగా పెరుగుదల కనిపిస్తోంది. గతంతో పోలిస్తే బుధవారం కొవిడ్ (Covid-19) కేసులు అమాంతం పెరిగాయి. ఏకంగా 7 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి.
India Corona | భారత్‌లో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజూవారీ పాజిటివ్ కేసుల్లో (Positive Cases) భారీగా పెరుగుదల కనిపిస్తోంది. గతంతో పోలిస్తే బుధవారం కొవిడ్ (Covid-19) కేసులు అమాంతం పెరిగాయి. ఏకంగా 7 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 2,14,242 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 7,830 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,47,76,002కి చేరింది.
మరోవైపు యాక్టివ్ కేసుల (Active Cases) సంఖ్య 40వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 40,215 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,42,04,771 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,016కి ఎగబాకింది.
ఇక ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 0.09 శాతం యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజూవారీ పాజిటివిటీ రేటు 3.65 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 3.83 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక రికవరీ రేటు 98.72 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,24,326) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read..
Data Protection Bill: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డేటా ప్రొటెక్షన్ బిల్లు
Myanmar | ఆ గ్రామంపై వైమానిక దాడిచేసింది మేమే.. ధృవీకరించిన మయన్మార్ సైన్యం
Delhi | ఢిల్లీలో వెయ్యికి చేరువైన రోజువారీ కరోనా కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

