భోపాల్: అనారోగ్య కారణాలతో బెయిల్‌పై విడుదలైన మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తాజాగా క్రికెట్ ఆడుతూ మీడియా కంటపడ్డారు. పది మంది మరణించి పలువురు గాయపడిన 2008 మాలెగావ్ పేలుళ్ల కేసుపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆమెను అరెస్ట్ చేసింది. అయితే అనారోగ్య కారణాలతో 2017లో బెయిల్‌పై విడుదలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై గెలిచారు.
కాగా, ఆరోగ్యం బాగోలేదంటూ బెయిల్‌పై విడుదలైన ప్రజ్ఞా ఠాకూర్ ఎక్కువగా వీల్ చైర్లోనే కనిపిస్తుంటారు. అయితే కొన్నేండ్లుగా ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా గార్బా డ్యాన్స్ చేయడంతోపాటు గతంలో బాస్కెట్ బాల్ కూడా ఆడారు.
తాజాగా తన నియోజకవర్గమైన భోపాల్‌లో క్రికెట్ ఆడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విపక్ష నేతలు మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. అనారోగ్య కారణాలతో బెయిల్‌పై విడుదలైన ప్రజ్ఞా ఠాకూర్ ఎంచక్కా ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
BJP MP Pragya Singh Thakur was seen playing cricket in Shakti Nagar Bhopal. pic.twitter.com/zR35yO1UAJ
— Mario David Antony Alapatt (@davidalapatt) December 26, 2021