దేశం దాటి వెళ్లేందుకు లాలూకు ఢిల్లీ కోర్టు అనుమతి
Lalu Yadav: వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్.. దేశం దాటి వెళ్లేందుకు
న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్.. దేశం దాటి వెళ్లేందుకు అనుమతి లభించింది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మెరుగైన వైద్యం కోసం వచ్చే నెల సింగపూర్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే వైద్య చికిత్స కోసం అక్టోబర్ 10 నుంచి 25 వరకు సింగపూర్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని లాలూ యాదవ్ కోర్టును కోరారు.
లాలూ అభ్యర్థనను పరిశీలించిన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సింగపూర్ వెళ్లేందుకు అనుమతించింది. IRCTC కుంభకోణానికి సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. ఈ కేసుల్లో ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. బెయిల్ షరతుల ప్రకారం ఆయన కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదు. ఈ నేపథ్యంలోనే లాలూ సింగపూర్ వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

