న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఇవాళ జాయింట్ కమిటీ మీటింగ్(Waqf Panel Meet) నిర్వహించింది. అయితే ఆ సమావేశం నుంచి అనేక మంది విపక్ష నేతలు వాకౌట్ చేశారు. ఢిల్లీ వక్ప్ బోర్డు సమర్పించిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఎంపీలు ఆ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఢిల్లీ ప్రభుత్వ అనుమతి లేకుండానే.. ఢిల్లీ వక్ఫ్ బోర్డు అడ్మినిస్ట్రేటర్ మీటింగ్‌లో ప్రజెంటేషన్ ఇచ్చినట్లు ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, డీఎంకే ఎంపీ మొహమ్మద్ అబ్దుల్లా, కాంగ్రెస్ ఎంపీ నసీర్ హుస్సేన్, మొహమ్మద్ జావెద్.. మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి అనుమతి లేకుండానే వక్ఫ్ బోర్డు రిపోర్టును మార్చేశారని ఎంసీడీ కమీషనర్, ఢిల్లీ వక్ఫ్ బోర్డు అడ్మినిస్ట్రేటర్ అశ్విని కుమార్‌పై విపక్షాలు ఆరోపణలు చేశాయి.