న్యూఢిల్లీ, జూన్ 29: బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన విపక్ష కూటమి రెండో సమావేశ వేదిక సిమ్లా నుంచి బెంగుళూరుకు మారింది. విపక్ష కూటమి తదుపరి సమావేశాన్ని బెంగళూరులో జూలై 13-14న నిర్వహిస్తున్నామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాల్లో విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొంటారని చెప్పారు. పాట్నాలో విపక్ష కూటమి మొదటి సమావేశం తర్వాత ప్రధాని మోదీలో కలవరపాటు మొదలైందని అన్నారు.