న్యూఢిల్లీ : ‘ఎక్స్’ వంటి సోషల్‌మీడియా నెట్‌వర్క్‌ను తీసుకురావటంపై ‘ఓపెన్ఏఐ’ కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. సంస్థ తీసుకురాబోతున్న సోషల్ మీడియా అప్లికేషన్ ప్రాథమిక నమూనాపై ‘చాట్‌జీపీటీ’ దృష్టిసారించిందని అమెరికా న్యూస్ వెబ్సైట్ ‘ద వెర్జ్’ కథనం పేర్కొన్నది. ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ప్రాజెక్ట్‌పై బయటి వ్యక్తుల నుంచి ప్రైవేట్‌గా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాడని తెలిపింది. అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ ఓపెన్‌ఏఐను సొంతం చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి అడ్డుపడ్డ ఆల్ట్‌మన్ ‘ఎక్స్’కు పోటీగా సోషల్ మీడియా అప్లికేషన్‌ను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్టు ‘ద వెర్జ్’ కథనం అభిప్రాయపడింది.