Fake Portals | న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆన్లైన్ బుకింగ్ మోసాలు ముఖ్యంగా చార్ధామ్ యాత్రికులు, భక్తులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలపై కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రజలను అప్రమత్తం చేసింది.
నకిలీ వెబ్సైట్లు, నకిలీ సోషల్ మీడియా పేజీలు, ఫేస్ బుక్ పోస్టులు, గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లపై కనిపించే పెయిడ్ ప్రకటనల ద్వారా ఈ మోసాలు జరుగుతున్నాయని సెంటర్ వెల్లడించింది. చార్ధామ్ యాత్రికులకు హోటల్ బుకింగ్లు, ట్యాక్సీ రిజర్వేషన్, తీర్థ యాత్రలు వంటి సేవలు అందచేస్తామంటూ ఈ నకిలీ వెబ్సైట్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని సెంటర్ పేర్కొంది.