రెండు టర్మ్లే ‘పెద్దల సభకు’.. అన్ని పోస్టులకూ ‘కాల పరిమితి’ విధించనున్న కాంగ్రెస్
సంకల్ప్ చింతన్ శిబిర్ వేదికగా కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై… రాజ్యసభకు ఎవర్నైనా రెండు టర్మ్లు మాత్రమే నామినేట్ చేయాలన్న ప్రతిపాదనలు తీసుకురానుంది. ఎంతటి కీలక వ్యక్తి అయినా సరే.. రెండు టర్ముల తర్వాత ఇక రాజ్యసభకు నామినేట్ చేయకూడదని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు సంస్థాగత వ్యవహారాల ప్యానల్ కసరత్తు ప్రారంభించింది.
ఈ విషయంపై సీడబ్ల్యూసీ సభ్యుడొకరు మాట్లాడుతూ… ఈ విషయం మా ప్యానల్ చర్చకు వచ్చింది. ఇప్పటి నుంచి రెండు సార్లు మాత్రమే ఓ వ్యక్తిని రాజ్యసభకు నామినేట్ చేయాలన్న చర్చ వచ్చింది. ఈ రాజ్యసభ కాల పరిమితి పూర్తైన తర్వాత సదురు సభ్యుడు తనకు నచ్చితే లోక్సభకు గానీ, అసెంబ్లీకి గానీ పోటీ చేసుకోవచ్చు. అంతేకానీ.. మూడోసారి మాత్రం రాజ్యసభకు ఆయన్ను నామినేట్ చేయం అన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చామన్నారు.
రాజ్యసభకే కాదు.. వీటికి కూడా కాలపరమితే..
ఇక పై రాజ్యసభకు మాత్రమే కాలపరిమితి విధించడం లేదని, దీనితో పాటు ఆఫీస్ బేరర్స్ అందరికీ తమ తమ పదవుల విషయంలో ఓ కాలపరిమితి విధించనున్నారు. ఈ నిబంధన బ్లాక్ స్థాయి నుంచి మొదలుపెడితే ఏఐసీసీ స్థాయి వరకూ వర్తింపజేయనున్నారు. ఐదేళ్లు మాత్రమే ఆయా పదవుల్లో ఉండేలా నిబంధన పెట్టనున్నారు.
కాల పరిమితి దాటితే రాజీనామా…
బ్లాక్ నుంచి మొదలు పెడితే ఏఐసీసీ వరకూ ఉన్న పోస్టుల్లో ఓ కాల పరిమితి తేవాలన్న చర్చ చింతన్ శిబిర్లో సాగుతోంది. ఐదేళ్ల పాటు సదురు సభ్యుడు తనకిచ్చిన పదవిలో వుంటారు. ఐదేళ్లు పూర్తి కాగానే… స్వతహాగా ఆయన తన పదవికి రాజీనామా చేసేయాలని నిబంధన తేనున్నారు. ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాత సదురు సభ్యుడికి మరో బాధ్యత అప్పజెప్పనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

