న్యూఢిల్లీ: ఇటీవల లండన్‌లో జరిగిన సౌత్‌బే సంస్థ వేలంలో ఒక స్కాచ్ విస్కీ సీసా 2.2 మిలియన్ పౌండ్ల(రూ.22 కోట్లు) రికార్డు ధరకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించింది. ఒక సీసా వైన్ లేదా ఇతర స్పిరిట్ల అమ్మకాల్లో వేలంలో అత్యధిక ధర పలికిన అమ్మకంగా ఇది కొత్త రికార్డు సృష్టించింది. మెక్కెల్లన్ అడమి 1926 బ్రాండ్‌కు చెందిన ప్రపంచంలోనే అతి విలువైన ఈ విస్కీని కొనడానికి కొనుగోలుదారులు పోటీపడ్డారు. ఈ అరుదైన విస్కీని 1986లో కేవలం 40 సీసాలు మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇదే పీపాలో నిల్వ చేసిన మరో సీసా విస్కీ 2019లో 1.5 మిలియన్ పౌండ్లకు అమ్ముడుపోయింది.