న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు త్వరలోనే సాకారమవుతాయని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. గురువారం గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవంలో ప్రధాని మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల ప్రతిపాదనను శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు సమర్పిస్తామన్నారు.
‘ఒక దేశం-ఒక ఎన్నికల దిశగా మేం పని చేస్తున్నాం. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పరిపుష్ఠం చేసి, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారడంలో తోట్పడతాయి. ఇవాళ భారత్ ‘ఒక దేశం- ఒక పౌర స్మృతి’ దిశగా అడుగులేస్తున్నది’ అని అన్నారు.