Onam | కేరళలో ఓనం సెలబ్రేషన్స్.. విశిష్టత, ప్రత్యేకతలు మీ కోసం
Onam | కేరళ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఓనం (Onam). ఈ పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైనది.
Onam | కేరళ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఓనం (Onam). ఈ పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. తెలంగాణలో బతుకమ్మ, బోనాలు, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి, తమిళనాట దీపావళి ఎంత ప్రసిద్ధో.. ఓనం కూడా కేరళ సంస్కృతికి ప్రతీక. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓనం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కేరళలోని వ్యవసాయ పండుగ. ఆగస్టు-సెప్టెంబర్ నెలలో వచ్చే ఈ పండుగను పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటుంటారు. ఇక ఈ పండుగను కేరళ ప్రజలే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల ప్రజలు కుడా ఏటా ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు. ఇప్పటికే ప్రారంభమైన ఓనం పండుగ విశేషాలు మీకోసం..
ప్రత్యేకతలు..
ఈ పండుగ సందర్భంగా పది రోజుల పాటు కేరళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. ఏనుగుల స్వారీలు, తెల్లటి దుస్తుల్లో మగువలు, రకరకాల పూలతో సుందరంగా చేసిన అలంకరణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలు రకరకాల పువ్వులను సేకరించి వాటితో ఇంటి ముందు అందమైన ముగ్గు వేసి ఆ మధ్యలో దీపం వెలిగిస్తారు. దీన్ని మలయాళంలో పూక్కలం అంటారు. ఓనం సందర్భంగా కేరళలో రంగవల్లులపై పోటీలు కూడా నిర్వహిస్తుంటారు.
ఓన సద్యం..
ఇక ఈ పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపై పలు రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తారు. సంప్రదాయ ఊరగాయలు, అప్పడాలు, పాయసం, పప్పు, అన్నంతోపాటు రకరకాల పిండివంటలను చేసుకుని కుటుంబమంతా కలిసి ఆరగిస్తారు.
కసావు స్టైల్ చీర కట్టు..
ఈ పండుగలో పూజలు, ముగ్గులు, పిండి వంటలే కాదు.. సంప్రదాయబద్ధమైన కట్టూబొట్టుకూ ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కసావు స్టైల్ చీరకట్టుకు ఈ పండుగలో ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారు వర్ణంతో మెరిసిపోయే ఈ చీరకు రంగురంగుల డిజైనర్ బ్లౌజుల్ని జతచేసి బుట్టబొమ్మల్లా మెరిసిపోతుంటారు కేరళ కుట్టీలు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన మొదలైన ఓనం వేడుకలు.. సెప్టెంబర్ 15న తిరుఓనంతో ముగుస్తాయి. ఈ ఏడాది కూడా ప్రజలు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
Also Read..
PM Modi | నేడు జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారానికి మోదీ.. 42 ఏళ్ల తర్వాత దోడాకు భారత ప్రధాని
Sanjauli mosque | సంజౌలి మసీదు వివాదం.. కొనసాగుతున్న ఆందోళనలు
Mid-Day Meal: మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి.. 65 మంది విద్యార్థులకు అస్వస్థత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

