న్యూఢిల్లీ: జాతీయ రహదారిపై భారీ చోరీ జరిగింది. బ్యాగులో 85 లక్షలు పెట్టుకుని, స్కూటరు మీద వెళ్తున్న వ్యక్తిని దోపిడీ(Accountant Looted) చేశారు. ఈ ఘటన ఢిల్లీ-లక్నో హైవేపై జరిగింది. బైకర్లు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన పట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డిసెంబర్ 15వ తేదీన ఈ ఘటన జరిగింది. నోయిడా వ్యాపారవేత్త వద్ద అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి.. హాపూర్ నుంచి క్యాష్తో రిటర్న్ అవుతున్న సమయంలో దారికాచిన దోపిడీ దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఒక వైపు కారు సపోర్టు తీసుకున్న ఆ వ్యక్తులు.. అకౌంటెంట్ బైక్‌ను కిందపడేసి అతని వద్ద ఉన్న డబ్బుతో పరారీ అయ్యారు.
రోడ్డుపై స్కూటరు పలుమార్లు దొర్లింది. స్కూటర్ స్కిడ్ అయ్యింది. ఇదంతా సీసీటీవీ ఫూటేజ్‌లో రికార్డు అయ్యింది. నిందితుల ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు. 50 వేల రివార్డును ప్రకటించారు. త్వరలో ఈ కేసును చేధించనున్నట్లు హాపూర్ ఎస్పీ కునార్ జ్ఞానాంజయ్ సింగ్ తెలిపారు.
फिल्मी स्टाइल में लूट करने का CCTV हुआ वायरल
यूपी के हापुड़ में 85 लाख रुपए लूट का CCTV आया सामने…इसमें बदमाश पीड़ित की बाइक को गिराते दिख रहे हैं। ये वारदात 15 दिसंबर को हुई, लुटेरे आज तक नहीं पकड़े गए।
मेरठ जोन/रेंज के अधिकारियों ने खुद कई दिन अलग-अलग कई जिलों की पुलिस… pic.twitter.com/vuFX0Z8DCG
— आदित्य तिवारी / Aditya Tiwari (@aditytiwarilive) December 26, 2025