Delhi | గుర్తు తెలియని దుండగులు తుపాకీలతో బెదిరింపు పెట్రోల్ సిబ్బందిని దోచుకున్నారు. ఈ ఘటన దేశ ఢిల్లీలోని ముంద్కా పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. రెండు ద్విచక్రా వాహనాలపై ఆరుగురు దుండగులు పెట్రోల్ బంక్ వచ్చారు. పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చినట్లుగా నటించి.. బంకులోని సిబ్బందిలో ఒకరు పెట్రోల్ పోసేందుకు సిద్ధమవుతుండగా.. తలకు తుపాకీ గురి పెట్టి దాడి చేస్తూ పక్కకు తీసుకెళ్లాడు.
పెట్రోల్ బంకు మిగతా సిబ్బంది ప్రతిఘటించడంతో దుండగులు కాల్పులకు దిగుతూ వచ్చిన బైక్‌లపైనే పరారయ్యారు. సిబ్బంది నుంచి రూ.10వేలను దుండగులు దోచుకెళ్లారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని ముంద్కా ఘేవ్రా మోడ్ పెట్రోల్ పంప్ వద్ద ఈ ఘటన జరిగింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దోపిడీకి సంబంధించిన దృశ్యాలు బంక్‌లోని సీసీకెమెరాలో రికార్డవగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.