వయసు మీదపడ్డాక.. ఎవరైనా ఏం చేస్తారు. కృష్ణా రామా అంటూ ఇంట్లో ఓ మూలన కూర్చొని కాటికి కాలు చాపుతారు. కానీ.. ఈ బామ్మ మాత్రం అలా చేయలేదు. 62 ఏళ్ల వయసులోనూ తనేంటో నిరూపించుకుంది. సాహసం చేసి ఔరా అనిపించింది. 6129 ఫీట్ల ఎత్తు ఉన్న కొండ ఎక్కి వావ్ అనిపించింది. ఈ ఘటన కేరళలోని పాలక్కడ్‌లో చోటు చేసుకుంది.
వెస్టర్న్ ఘాట్స్లోనే అత్యంత ఎత్తైన కొండల్లో ఒకటి అగస్త్యార్కూదం. దాన్ని నాగరత్నమ్మ అనే బామ్మ చకచకా ఎక్కేసింది. తన కొడుకుతో బెంగళూరులో ఉండే నాగరత్నమ్మ ఇటీవల కేరళకు వెళ్లింది. అదే సమయంలో ఆ కొండపై ట్రెక్కింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. నాగరత్నమ్మ ఆ కొండ ఎక్కుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.