Viral Video | అమ్మాయిల భద్రత, సమాజంలో మహిళల పట్ల ఉన్న దృక్పథంపై మరోసారి సోషల్‌మీడియాలో ఓ చర్చ మొదలైంది. దేశంలో అమ్మాయిలకు బయటే కాదు.. పోస్టర్లపై కూడా రక్షణ లేకుండా పోయిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్‌పై ఉన్న అమ్మాయిల ఫొటోలతో ఓ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడమే ఇప్పుడు ఈ విమర్శలకు కారణమైంది.
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. అమ్మాయిల ఫొటోలతో ఉన్న పోస్టర్లను అతికించిన డీజే వాహనం ఓ గ్రామంలోకి వెళ్లింది. అక్కడ ఓ వృద్ధుడు పోస్టర్లపై ఉన్న అందమైన అమ్మాయిల ఫొటోలను చూసి ఆపుకోలేకపోయాడు. వెంటనే ఆ వాహనం దగ్గరకు వెళ్లి యువతి పోస్టర్‌ను నాలుకతో నాకాడు. ముద్దులు పెట్టాడు. అంతటితో ఆగకుండా వాహనానికి మరోవైపు అతికించిన పోస్టర్ దగ్గరకు వెళ్లి అక్కడ కూడా అలాగే చేశాడు. ఈసారి పోస్టర్‌పై ఉన్న అమ్మాయి పెదాలకు లిప్‌కిస్‌లు పెడుతూ.. మొహం అంతా నాకుతూ మరింత అసభ్యంగా ప్రవర్తించాడు. చుట్టూ చిన్న పిల్లలు ఉన్నారన్నా కనీస ఇంగితం కూడా లేకుండా ఆ వృద్ధుడు చేసిన చర్యను అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.
వృద్దుడి చేష్టలకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలకు బహిరంగ ప్రదేశాల్లోనే కాదు.. పోస్టర్లపై కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. ఇలాంటి వారి వల్లే సమాజంలో చిన్న పిల్లలపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు.