ముంబై: ముంబైలో దారుణం జరిగింది. ఓ క్యాబ్ డ్రైవర్(Cab Driver)ను.. ఆడీ కారు డ్రైవర్ తీవ్రంగా కొట్టాడు. క్యాబ్ డ్రైవర్ పైకి లేపి కింద పదేశాడు. ఆ తర్వాత అతన్ని తన్నాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆడీ కారు వెనుకాలే వచ్చిన ఓలా డ్రైవర్.. బ్రేక్ వేయడంలో ఆలస్యం కావడంతో.. ఆడీ బంపర్‌ను ఢీకొన్నాడు. దీంతో ఆడీ కారులో ఉన్న దాని ఓవర్ రిషబ్ చక్రవర్తి, ఆయన భార్య అంతారా ఘోష్, మరో మహిళ కారు దిగి వచ్చారు.
ఆ తర్వాత రిషబ్.. ఓలా డ్రైవర్ వద్దకు వెళ్లి అతన్ని తీవ్రంగా కొట్టాడు. కిందపడేసి మరీ తన్నాడు. కింద పడిన సమయంలో ఓలా డ్రైవర్ తలకు గాయాలు అయ్యాయి. అతన్ని కదలకుండా అలాగే ఉండిపోయాడు. ఆ ఘటన సమయంలో అక్కడే ఉన్న జనం.. నిర్ఘాంతపోయారు. ఆగస్టు 18వ తేదీన రాత్రి 11.20 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. ఘాట్కోపర్లోని ఓ మాల్ వద్ద ఉన్న బిల్డింగ్‌లో ఈ ఘటన జరిగింది. ఓలా డ్రైవర్ అన్సారీని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు బుక్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆడీ కారు జంటకు.. పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Guys, please don’t get into road rage.
It can land you into trouble.
Ola rammed into Audi which led to this.
Also there is a backstory to this, which needs to be verified as the reason why the Audi driver took such an extreme step.
📍Mumbaipic.twitter.com/viFcWHmRv6
— Roads of Mumbai (@RoadsOfMumbai) August 30, 2024