న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్‌లపై ప్రభుత్వం నిఘా పెంచింది. ఇటీవలే వాట్సాప్ ‘యూజర్ నేమ్’ ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇతర మెసేజింగ్ వేదికలైన టెలిగ్రామ్, సిగ్నల్ లపై కూడా కేంద్రం పరిశీలన ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఐటీ మంత్రిత్వ శాఖ ఈ రెండు సంస్థలకు నోటీసులు పంపింది.
ప్రస్తుతం వాడుకలో ఉన్న యూజర్ నేమ్ ఫీచర్ ద్వారా జరిగే మోసాల నుంచి ఎలా రక్షిస్తారో వివరించాలని ఆదేశించింది. యూజర్ నేమ్‌పై ఇప్పటికే వాట్సాప్‌నకు కేంద్రం నోటీసు లిచ్చింది.