Mayavati : మాజీ ప్రధాని (Former Prime Minister) మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అంత్యక్రియలు, స్మారకంపై రాజకీయాలు చేయడాన్ని బీఎస్పీ చీఫ్ (BSP chief) మాయావతి (Mayavati) తీవ్రంగా ఖండించారు. మన్మోహన్ సింగ్ కుటుంబం, సిక్కు మతం యొక్క సెంటిమెంట్స్‌ను కేంద్ర సర్కారు గౌరవించాలని ఆమె హితవుపలికారు. మన్మోహన్ సింగ్ కుటుంబం ఎక్కడైతే ఆయన స్మారకాన్ని నిర్మించాలని కోరుతున్నదో అక్కడే నిర్మించాలని సూచించారు.
ఈ విషయంలో ఎవరికీ రాజకీయాలు చేసే హక్కు లేదని, కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ కుటుంబం కోరిన చోటనే ఆయన స్మారకాన్ని నిర్మించాలని మాయ డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగిన చోటనే ఆయన స్మారకాన్ని నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుండగా.. అక్కడ కుదరదని ఆయన స్మారకాన్ని ఎక్కడ నిర్మించాలనేది త్వరలో నిర్ణయిస్తామని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో మాయావతి తాజా వ్యాఖ్యలు చేశారు.