ముంబై: ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మకు ముంబైలోని సెషన్స్ కోర్టు ఈ నెల 4న నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్షను నిలిపివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది.
తదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేసింది. కోర్టుకు హాజరైన తర్వాత బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. వర్మ నేరానికి పాల్పడినట్లు అంధేరీలోని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ జనవరి 21న తీర్పు చెప్పారు.