లక్నో: పనిమనిషిని ఒక మహిళ లిఫ్ట్‌లో కొట్టింది. మహిళ దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి తెగ ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 120లోని క్లియో కౌంటీ హౌసింగ్ సొసైటీలో నివసించే షెఫాలీ కౌల్ వద్ద 20 ఏళ్ల అనిత ఇంటి పనిమనిషిగా ఉన్నది. 24 గంటలపాటు పని కోసం కాంట్రాక్ట్ కింద ఆమెను నియమించుకున్నది. అయితే ఆ యువతితో ఎక్కువ గంటలు పని చేయించుకోవడంతోపాటు ఆమెను వేధింపులకు గురి చేస్తున్నది. తన ఇంటికి వెళ్తానని అన్నప్పుడల్లా దారుణంగా కొట్టేది. అలాగే పనిమనిషి అనితను పలుమార్లు గదిలో కూడా బంధించింది.
కాగా, పనిమనిషి అనితను కౌల్ లిఫ్ట్ నుంచి బయటకు లాగి దారుణంగా కొట్టింది. దీంతో ఆమె దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి తెగ ప్రయత్నించింది. లిఫ్ట్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పనిమనిషి అనిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు పనిమనిషి తన ఇంట్లో దొంగతనం చేసిందని, తన భోజనంలో నిద్రమాత్రలు కలిపిందంటూ షెఫాలీ కౌల్ ఆరోపించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ పోలీసులకు ట్వీట్ చేసింది.
I have all CCTV footage and independent witness that she has committed theft and mixed sleeping pills in my meal pic.twitter.com/ru37Wof9bm
— Shefali (@shefalikoul) December 27, 2022