Noida Authority | న్యూఢిల్లీ: విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులను 20 నిమిషాలు నిలబడి పనిచేయాలని వారి బాస్ ఆదేశించారు. యూపీలోని నోయిడాలో న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం రోజూ వందలాదిమంది వస్తుంటారు.
2005 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ లోకేశ్ ఎం గతేడాది దీనికి సీఈవోగా ఉన్నారు. ఒక వృద్ధుడు లైన్లో నిలబడి ఉండటాన్ని గమనించి ఆయన పనిని చూడాలంటూ ఒక మహిళా ఉద్యోగికి చెప్పాడు. 20 నిమిషాల తర్వాత కూడా ఆయన నిల్చుని ఉండటం చూసి ఉద్యోగులకు ఆయన 20 నిమిషాల శిక్ష విధించారు.