12 ప్లస్‌కు జైడస్.. మరికొన్ని రోజుల్లో టీకాకు అనుమతి

న్యూఢిల్లీ : పన్నెండేళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చే జైడస్ క్యాడిలా కోవిడ్ టీకాకు అత్యవసర అమనుతి దక్కే అవకాశాలు ఉన్నాయి. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) రాబోయే కొన్ని రోజుల్లో ఆ టీకాకు అనుమతి ఇవ్వనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా వెల్లడైంది. జైడస్ క్యాడిలా టీకాలను యువకులతో పాటు 12 ఏళ్లు దాటిన పిల్లలపై ట్రయల్స్ నిర్వహించారు. అయితే ట్రయల్స్ డేటా పట్ల ఒకవేళ ప్రభుత్వం సముఖంగా ఉంటే, ఆ కంపెనీ టీకాకు వెంటనే అత్యవసర వినియోగం కింద అనుమతి దక్కే అవకాశాలు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. డీసీజీఐకి చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ(ఎస్ఈసీ) జైడస్ డేటాను పరిశీలించనున్నది. ఒకవేళ అనుమతి దక్కితే, ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో టీకాల సరఫరా మొదలవుతుందని కూడా అధికారులు తెలిపారు. 12 నుంచి 18 ఏళ్ల వారి కోసం జైడస్ టీకా సెప్టెంబర్ చివరినాటికి అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఇటీవల కోవిడ్ వర్కింగ్ గ్రూపు సాంకేతిక సలహా మండలి చైర్మన్ ఎన్కే అరోరా చెప్పిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

