న్యూఢిల్లీ: ఓటీటీ ప్రసారాల్లోనూ ఇకపై ధూమపానం నిషేధానికి సంబంధించిన హెచ్చరికలు కనిపించనున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇప్పటివరకు సినిమా థియేటర్, టీవీల్లో మాత్రమే ధూమపానం సేవించే సన్నివేశాలు వచ్చినప్పుడు ధూమపానం నిషేధానికి సంబంధించిన హెచ్చరికను చూపిస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల్లో ఓటీటీల్లోనూ దీన్ని తప్పనిసరి చేశారు. ఓటీటీ కారణంగా మైనర్లు ప్రభావితమయ్యే ఆస్కారం ఉందని అందుకే ఓటీటీల్లోనూ ధూమపాన హెచ్చరికల ప్రసారాన్ని తప్పనిసరి చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.