Gas Cylinder | ఆ గ్యాస్ సిలిండర్లకు అడ్రస్ ప్రూఫ్ అక్కర్లేదు : కేంద్రం
Gas Cylinder | పశ్చిమాసియా (West Asia) లో యుద్ధం కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఫలితంగా భయపెడుతున్న ఇంధన కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక ప్రకటన చేసింది. ఇకపై 5 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ (5Kg LPG Gas Cylinder) ను అడ్రస్ ప్రూఫ్ (Adress Proof) అవసరం లేకుండా కేవలం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి కొనుగోలు చేయవచ్చని స్పష్టంచేసింది.
Gas Cylinder : పశ్చిమాసియా (West Asia) లో యుద్ధం కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఫలితంగా భయపెడుతున్న ఇంధన కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక ప్రకటన చేసింది. ఇకపై 5 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ (5Kg LPG Gas Cylinder) ను అడ్రస్ ప్రూఫ్ (Adress Proof) అవసరం లేకుండా కేవలం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి కొనుగోలు చేయవచ్చని స్పష్టంచేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన చేసింది. సమీపంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని పెట్రోలియం శాఖ (Petrolium Ministry) తెలిపింది.
అదేవిధంగా దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రజలు ఆందోళనచెంది ఇంధనాన్ని అధికంగా కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ ఔట్లెట్లు సాధారణంగా పనిచేస్తున్నాయని, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. ముఖ్యంగా వలస కార్మికులు, స్థానిక చిరునామా పత్రాలులేని వారిని దృష్టిలో ఉంచుకుని 5 కేజీల సిలిండర్ నిబంధనను సరళతరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారు 5.7 లక్షల సిలిండర్లను అడ్రస్ ప్రూఫ్ నిబంధన లేకుండా విక్రయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచామని, రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపింది. మరోవైపు అక్రమ నిల్వలు, నల్ల బజారును అరికట్టేందుకు నిఘా పెంచామని, ఇటీవల 3,700కు పైగా దాడులు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన డిస్ట్రిబ్యూటర్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

