న్యూఢిల్లీ, జూన్ 8: మోడర్న్ మెడిసన్‌ను ప్రాక్టీస్ చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టం, 2019లో రిజిష్టర్ అయిన ప్రాక్టీషనర్లు (ఆర్ఎంపీలు) తమ పేర్లకు ముందు మెడికల్ డాక్టర్ (మెడ్ డీఆర్.) అనే ప్రిఫిక్స్ చేర్చుకోవచ్చని ఎన్ఎంసీ కీలక ప్రతిపాదన చేసింది. దుర్భాషలాడుతూ, దాడులకు పాల్పడే రోగులకు డాక్టర్లు వైద్యం నిరాకరించవచ్చని తెలిపింది. ఈ మేరకు ఎన్ఎంసీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ప్రొఫెషనల్ కండక్డ్) రెగ్యులేషన్స్, 2022 పేరిట డ్రాఫ్ట్ విడుదల చేసింది. దీనిపై ఈ నెల 22లోపు సలహాలు, సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.