Nitish Kumar | ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణం.. బిహార్ కొత్త సీఎం ఎవరో తేలేది అప్పుడే
Nitish Kumar : బిహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఈ నెల 10న ప్రమాణ స్వీకారం చేస్తారు.
Nitish Kumar : బిహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఈ నెల 10న ప్రమాణ స్వీకారం చేస్తారు. నితీష్ కుమార్‌తోపాటు కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యసభలో ప్రమాణానికి ఈ నెల 9న నితీష్ ఢిల్లీ వెళ్తారు. ఏప్రిల్ 10న ప్రమాణం అనంతరం, ఏప్రిల్ 12న బిహార్ రాజధాని పాట్నాకు తిరిగొస్తారు. ఆ తర్వాత ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేస్తారు.
ఆలోపు కొత్త సీఎంను ఎన్నుకుంటారు. కొత్త సీఎం ఆధ్వర్యంలో బిహార్ నూతన ప్రభుత్వం ఈ నెల 14న కొలువుదీరే అవకాశం ఉంది. నితీష్ సీఎం పదవి నుంచి తప్పుకోనున్నప్పటికీ, ఆయన భద్రత విషయంలో మాత్రం రాజీపడటం లేదు. రాష్ట్ర హోం శాఖ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నితీష్ రాజ్యసభ ఎంపీ అయినప్పటికీ, ఆయనకు సీఎంలకు ఇచ్చే జడ్+ సెక్యూరిటీని కొనసాగించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆదేశాలు జారీ అయ్యాయి. జేడీయూ చీఫ్‌గా ఉన్న నితీష్ తన సీఎం పదవికి రాజీనామా చేయడం ఆయన పార్టీ వర్గాల్లో కొంత గందరగోళానికి దారితీసింది. ఇక, నితీష్ తర్వాత ఎవరు సీఎం పదవి చేపడతారు అనే చర్చ కొనసాగుతోంది. ఈ విషయంలో ఎన్డీయే కూటమిగా ఉన్న ప్రభుత్వంలో బీజేపీ అభ్యర్థి సీఎం అవుతారని సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి (బీజేపీ) సీఎం రేసులో ముందున్నారు.
అలాగే, కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ పేరు కూడా వినిపిస్తోంది. త్వరలో బీజేపీ కార్యనిర్వాహక సమావేశం అనంతరం సీఎంను ఎన్నుకునే అవకాశం ఉంది. కేంద్ర బీజేపీ నాయకుల సూచన మేరకే రాష్ట్రంలో నిర్ణయాలుంటాయి. బీజేపీ గతంలో ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. 20 ఏళ్లుగా కూటమిలో ఉన్నా ఎప్పుడూ నేరుగా అధికారం చేపట్టలేదు. ఈసారి మాత్రం నితీష్ స్తానంలో బీజేపీ అభ్యర్థి సీఎం పదవి చేపట్టబోతున్నారు. ఇక, జేడీయూ కూడా వీలైనన్ని ఎక్కువ మంత్రి పదవులు దక్కించుకోవాలని చూస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

