అలీపుర్ద్వార్, జనవరి 10: దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ మంగళవారం పశ్చిమ బెంగాల్లోని అలీపుర్ద్వార్ కోర్టు ముందు హాజరయ్యారు. 2009లో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి 2022 నవంబర్ 11న అలీపుర్ద్వార్ కోర్టు నిశిత్ ప్రామాణిక్పై అరెస్ట్ వారంట్ జారీ చేసింది. అయితే కలకత్తా హైకోర్టు నవంబర్ 23న దీనిపై స్టే విధించింది. జనవరి 12లోగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ గడువు ముగస్తున్న నేపథ్యంలోనే ఆయన తాజాగా కోర్టు ముందు హాజరయ్యారు. అలీపుర్ద్వార్ రైల్వే స్టేషన్ సమీపంలోని బంగారం దుకాణంలో, బీర్పాడాలోని రెండు బంగారం దుకాణాల్లో 2009లో దొంగతనం జరిగింది. ఆ కేసులో మరోవ్యక్తితో పాటుగా ప్రామాణిక్ నిందితుడిగా ఉన్నారు.