Hooch Tragedy | కల్తీ మద్యంతో దళితులు మరణిస్తుంటే నోరు మెదపని రాహుల్ గాంధీ : నిర్మలా సీతారామన్
Hooch Tragedy : తమిళనాడు కల్తీ సారా ఘటనలో 50 మందికిపైగా మరణించిన ఘటనపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
Hooch Tragedy : తమిళనాడు కల్తీ సారా ఘటనలో 50 మందికిపైగా మరణించిన ఘటనపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. కళ్లకురుచిలో జరిగిన ఈ ఘటనలో 200 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరి పరిస్ధితి విషమంగా ఉందని అన్నారు.
ఈ ఘటనలో ఇప్పటికే 56 మంది మరణించారని, వీరిలో అధికులు షెడ్యూల్డ్ కులాల వారే అని పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె తెలిపారు. కల్తీ సారా ఘటనపై కాంగ్రెస్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం తనను విస్మయానికి గురిచేసిందని నిర్మలా సీతారామన్ అన్నారు.
ప్రభుత్వం నిర్వహించే షాపుల్లో కళ్లకురుచిలో బాహాటంగా కల్తీ మద్యం, నాటు సారా విక్రయిస్తుంటే డీఎంకే సర్కార్‌కు మద్దతిస్తున్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ, అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడున్నారని ఆమె నిలదీశారు. కల్తీ మద్యంతో దళితులు మరణిస్తుంటే రాహుల్ గాంధీ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
Read More :
Talasani Shankar Yadav | తలసాని శంకర్ యాదవ్ సేవలు వెలకట్టలేనివి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

