Talasani Shankar Yadav | తలసాని శంకర్ యాదవ్ సేవలు వెలకట్టలేనివి
Talasani Shankar Yadav | కార్మికులు, వర్తకుల సమస్యల పరిష్కారం కోసం తలసాని శంకర్ యాదవ్(Talasani Shankar Yadav) ఎనలేని సేవలు అందించారని పలువురు స్మరించుకున్నారు.
హైదరాబాద్ : కార్మికులు, వర్తకుల సమస్యల పరిష్కారం కోసం తలసాని శంకర్ యాదవ్(Talasani Shankar Yadav) ఎనలేని సేవలు అందించారని పలువురు స్మరించుకున్నారు. బోయిన్పల్లి(Boinpalli) మార్కెట్ వర్తకులు, కార్మికుల సంఘం మాజీ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ ఇటీవల మరణించగా ఆయన జ్ఞాపకార్ధం శంకర్ యాదవ్ సోదరుడు నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం బోయిన్పల్లి మార్కెట్ ఆవరణలో అన్నదాన (Annadanam) కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా శంకర్ యాదవ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్మికులకు అన్నివేళలా అండగా నిలిచిన శంకర్ యాదవ్ మరణం తమను తీవ్ర దుఃఖానికి గురి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మార్కెట్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు గిరిధర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, తలసాని శంకర్ యాదవ్ సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

