Nirmala Sitaraman : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరర్ధకమైన బడ్జెట్ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానాలు చేస్తే ఏ పనీ జరగదని, రంగంలోకి దిగి, ఏదో ఒకటి చేయాలని నిర్మలా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి చురకలంటించారు. అతి తొందరగా స్పందించే వారిపై నాకు విపరీతమైన జాలి కలుగుతుంది. ట్విట్టర్ వేదికగానే స్పందిస్తూ వుంటే… దాని వల్ల ఒరిగేదేమీ వుండదు. ముందు మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏదో ఒకటి చేసి చూపండి. ఆ తర్వాత కేంద్రం గురించి మాట్లాడండి అంటూ నిర్మలా సీతారామన్ తీవ్రంగా మండిపడ్డారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై చాలా మంది విపక్షనేతలు స్పందిస్తూనే వున్నారు. ఈ కోవలోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. కేంద్ర బడ్జెట్ జీరో బడ్జెట్ అని విమర్శించారు. ఇది సున్నా బడ్జెట్ అని, పేదలు, మధ్యతరగతి వర్గాలతో పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు కూడా మొండిచేయి చూపించారని రాహుల్ గాంధీ విమర్శించారు.