Night club fire : గోవా నైట్ క్లబ్ (Goa Night club) అగ్నిప్రమాదం (Fire accident) కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న లూత్రా బ్రదర్స్ (Luthra brothers) కు ఉత్తర గోవా (North Goa) లోని న్యాయస్థానం ఐదురోజుల పోలీస్ కస్టడీ (Police custody) విధించింది. ఈ నెల 6న రాత్రి గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్ యజమానులైన గౌరవ్ లూథ్రా, సౌరభ్ లూథ్రాలు ప్రమాదం జరిగిన వెంటనే థాయ్‌లాండ్‌కు పారిపోయారు.
దాంతో ఇంటర్‌పోల్ బ్లూకార్నర్ నోటీసు ద్వారా గోవా పోలీసులు థాయ్‌లాండ్ పోలీసులను సంప్రదించారు. వారు ఈ నెల 11న ఫుకెట్‌లో లూత్రా బ్రదర్స్‌ను అరెస్ట్ చేశారు. మంగళవారం ఇండిగో విమానంలో భారత్‌కు డిపార్ట్ చేశారు. వారు ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి ట్రాన్సిట్ రిమాండ్ ప్రాసెస్ పూర్తిచేసి గోవాకు తీసుకొచ్చారు. ఇవాళ కోర్టులో హాజరుపర్చగా పోలీస్ కస్టడీ విధించింది.