న్యూఢిల్లీ, జూలై 7: పారిశ్రామికవేత్త అదానీ ఆధ్వర్యంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాపులలో ప్రభుత్వం నిషేధించిన నికోటిన్ పౌచ్‌ల అమ్మకం యథేచ్ఛగా కొనసాగుతున్నది. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం భారత దేశం ఇ-సిగరెట్లను నిషేధించి ప్యాచ్‌లు వంటి కొన్ని నికోటిన్ ప్రత్యామ్నాయాలను ఆమోదించింది. అయితే అవి అమ్మడానికి లైసెన్స్ కావాలి. అదానీ దుకాణాల్లో వీటిని ఆమోదం లేకుండా అమ్ముతున్నట్టు గుర్తించారు. ఇండియా డ్రగ్ శాఖ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తనిఖీలు నిర్వహించి ఎలాంటి అనుమతులు లేకుండానే దిగుమతి చేసుక్ను నికోటిన్ పౌచ్‌లను అమ్ముతున్నట్టు గుర్తించింది. దీనిపై కేసు నమోదు కాగా, అదానీ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. నికోటిన్ పౌచ్‌లు మాదకద్రవ్యం కాదని న్యాయస్థానంలో వాదించింది. కేసును విచారించిన హైకోర్టు ప్రస్తుతం డ్యూటీ ఫ్రీ షాపుల్లో ఉన్న స్టాక్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని ఆదేశిస్తూ కేసును జూలై 14కు వాయిదా వేసింది. సాధారణంగా ధూమపానం మానే ప్రయత్నంలో నికోటిన్ పౌచ్‌లను ఉపయోగిస్తారు.