NIA Chargesheet | గత జూన్‌లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరే దర్బంగా ఎక్స్‌ప్రెస్‌లో బీహార్‌లో దర్బంగా రైల్వేస్టేషన్లో బాంబు పేలుళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. పాట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ. ఐదుగురు నిందితులపై అభియోగాలు మోపింది. మహ్మద్ నసీర్ ఖాన్ అలియాస్ నాసిర్ మాలిక్,ఇమ్రాన్ మాలిక్, సలీం అహ్మద్, హాజీ సలీం, కఫిల్ అహ్మద్ అలియాస్ కఫిల్, ఇక్బాల్ మహమ్మద్ అలియాస్ ఇక్బాల్ ఖన్నాలపై అభియోగాలు రికార్డు చేసింది.
వారిపై ఐటీ చట్టంలోని 120బీ, 468, 471 సెక్షన్లతోపాటు పేలు పదార్థాల చట్టంలోని 4,5 సెక్షన్లు, యూఏ(పీ) చట్టంలోని 16,17,18, 18మీ, 20, 23, 39 సెక్షన్ల కింద అభియోగాలు రిజిస్టర్ చేసింది. ప్రస్తుతం పాక్‌లోని లాహరోలో ఇక్బాల్ ఖన్నా ఉంటున్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
పేలుడుకు ముందుకు నిందితులకు పాకిస్థాన్‌లో మాలిక్ సోదరులు శిక్షణ ఇచ్చారని, పాల్పడిన నిందితులు నేపాల్ మీదుగా పాకిస్థాన్ వెళ్లేందుకు కుట్ర పన్నారని ఎన్ఐఏ తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా పేలుళ్లకు కుట్ర చేశారని ఆరోపించింది.