న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్(NewsClick) వెబ్సైట్ వ్యవస్థాపకుడు ప్రబిర్ పుర్కయస్తా, ఆ సైట్ హెచ్ఆర్ శాఖాధిపతి అమిత్ చక్రవర్తి.. ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూఏపీఏ చట్టం కింద ఆ ఇద్దరూ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ ఇద్దరూ సుప్రీంను ఆశ్రయించారు. సీజే డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఇవాళ విచారించింది. ప్రబిర్ పుర్కయస్తా తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఇది న్యూస్‌క్లిక్‌కు చెందిన అంశమని, జర్నలిస్టులు పోలీసు కస్టడీలో ఉన్నారని, అరెస్టు అయిన వారిలో ఓ వ్యక్తి 75 ఏళ్ల ఉన్నాడని సిబల్ కోర్టుకు తెలిపారు. యూఏపీఏ కింద అరెస్టు చేస్తున్న సమయంలో రాతపూర్వక వారెంట్ అవసరం లేదని ఢిల్లీ కోర్టు తెలిపింది.